భారత్‌ను తాకిన భూప్రకంపనలు..

ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీ భూప్రకంపనలు సంభవించాయి. నేపాల్‌లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత వెంట వెంటనే నాలుగు సార్లు భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ – ఎన్‌సిఆర్ పరిసర ప్రాంతాల్లో బలంగా భూమి కంపించింది. ఉత్తర ప్రదేశ్‌లోని లఖ్‌నవూ, హాపుర్ అమ్రెహా, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తొలుత 2.25 గంటల ప్రాంతంలో సంభవించిన ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 4.6 తీవ్రతగా రికార్డయి్యింది. అనంతరం 2.51 గంటలకు 6.2 తీవ్రతతో భూమి కంపించింది. భూమికి పది, ఐదు కిలో మీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్న ఎస్‌సిఎస్ గుర్తించింది. తర్వాత 3.06, 3.19 గంటలకు మరో రెండు సార్లు స్వల్ప తీవ్రతతో భూమి కంపించినట్లు సమాచారం. భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అఫీసుల నుండి బయటకు పరుగులు తీశారు.