4 ఏళ్ల జీతం బోన‌స్‌.. ఉద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ ప్ర‌క‌టించిన షిప్పింగ్ సంస్థ‌

తైపీ (CLiC2NEWS): తైవాన్‌కు చెందిన ఓ షిప్పింగ్ సంస్థ త‌మ ఉద్యోగుల‌కు భారీ స్థాయిలో బోన‌స్ ప్ర‌క‌టించింది. ఎవ‌ర్‌గ్రీన్ మెరైన్ కార్పోరేష‌న్ ఏకంగా 50 నెల‌ల జీతంతో స‌మాన‌మైన బోన‌స్‌ను ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ బోన‌స్ నాలుగు సంవ‌త్స‌రాల జీతం కంటే ఎక్కువ‌. ఉద్యోగి జాబ్ గ్రేడ్‌, తైవాన్ ఆధారిత కాంట్రాక్టులు క‌లిగిన సిబ్బందికి మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంద‌ని, ఒక ఏడాదిలో సంస్థ‌, ఉద్యోగి ప‌నితీరు మీద ఆధార‌ప‌డి సంవ‌త్సరాంత‌పు బోన‌స్‌లు ఉంటాయ‌ని ఆ సంస్థ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఎవ‌ర్‌గ్రీన్ సంస్థ‌కు గ‌డిచిన రెండు సంవ‌త్స‌రాల‌లో భ‌రీ స్థాయిలో వ్యాపారం పెర‌గ‌డంతో ఆదాయం కూడా పెరిగిన‌ట్లు స‌మాచారం. అది 2020 సంవ‌త్స‌రం కంటే 2022లో ఆ సంస్థ ఆదాయం మూడు రెట్లు అధిక‌మైన‌ట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.