పెట్రోల్ ట్యాంకర్ పేలి 40 మంది మృతి

ఓ పెట్రోల్ ట్యాంకర్ పేలి 40 మంది మరణించారు. లైబీరియాలో పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి పడిపోయింది. ట్యాంకర్ నుండి లీకవుతుండటంతో జనం గుమిగూడి పెట్రోల్ పట్టుకుంటుండగా.. ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో 40 మంది పౌరులు మృత్యువాత పడ్డారు. 83 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు లైబీరియా అధికారులు తెలిపినట్లు సమాచారం.