Hanumakonda: కలుషిత ఆహారం తిన్న 40 మంది విద్యార్థులకు అస్వస్థత
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/Junior-college-student-in-battupalli.jpg)
హనుమకొండ (CLiC2NEWS): జిల్లాలోని బట్టుపల్లి ఎస్ ఆర్ ఫ్రైమ్ జూనియర్ కాలేజీలోని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి తిన్న ఆహారం కలుషితం కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. విద్యార్థులకు ఎగ్ బిర్యాని, చికెన్‌తో కూడిన ఆహారం వడ్డించారు. ఇది తిన్న తర్వాత ఇంటర్ ఎంపిసి చదువుతున్న విద్యార్థుల్లో సుమారు 40 మందికి వాంతులు విరోచనాలు మొదలయ్యాయి. వీరిలో కొందరిని హనుమకొండ జయ ఆస్పత్రికి తరలించారు. మరి కొందరిని వరంగల్ ఉరుసుగుట్ట హంటర్ రోడ్డులోని ఫషాదర్ కొలంబొ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరిలో చాలామంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆరుగురు మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వైద్యులు ప్రకటించారు.