ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో 4వేల అప్రెంటిస్‌ ఖాళీలు

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే 4,232 అప్రెంటిస్‌ల‌లో శిక్ష‌ణా ప్ర‌వేశాల‌కు ఐటిఐ ఉత్తీర్ణులైన వారి నుండి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. సికింద్రాబాద్ లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌(ఆర్ఆర్‌సి)- ఎస్‌సిఆర్ వ‌ర్క్‌షాప్/ యూనిట్స్‌లో యాక్ట్ అప్రెంటిస్ ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 100 ( ఎస్‌సి, ఎస్‌టి, దివ్యాంగులు, మ‌హిళ‌ల‌కు ఫీజు లేదు). దరాఖాస్తుల‌కు చివ‌రి తేదీ జ‌న‌వ‌రి 27గా నిర్ణ‌యించారు.

ప‌దోత‌ర‌గ‌తి, ఐటిఐలో సాధించిన మార్కులు ఆధారంగా ఎంపిక‌చేస్తారు. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 28.12.2024 నాటికి 15 నుండి 24 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉండాలి. ఒబిసిల‌కు మూడేళ్లు, ఎస్‌సి, ఎస్‌టిల‌కు ఐదేళ్ల స‌డ‌లింపు ఉంటుంది.

ట్రేడుల వారీగా ఖాళీలు

ఎసి మెకానిక్ – 143

ఎయిర్ కండిష‌నింగ్ -32

ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌-85

ఎల‌క్ట్రీషియ‌న్ -1053

కార్పెంట‌ర్-42

డిజిల్ మెకానిక్ – 142

ఇంస్ట్రియ‌ల్ ఎల‌క్ట్రానిక్స్‌-10

ఎల‌క్ట్రిక‌ల్ (ఎస్‌ఖిటి) (ఎల‌క్ట్రీషియ‌న్)-10

ప‌వ‌ర్ మెయింటెనెన్స్ (ఎల‌క్ట్రీషియ‌న్)-34

ట్రైన్ లైటింగ్ (ఎల‌క్ట్రీషియ‌న్ )-34

ఫిట్ట‌ర్- 1742

మోటార్ మెకానికల్ వెహిక‌ల్ (ఎంఎంవి)- 08

మెషినిస్ట్ -100

మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ (ఎంఎంటిఎం)-10

పెయింట‌ర్- 74

వెల్డ‌ర్ – 713

మొత్తం 4,232 అప్రెంటిస్ ఖాళీలు క‌ల‌వు. వీటిలో ఎస్‌సి -635
ఎస్‌టి- 317, ఒబిసి- 1143, ఇడ‌బ్ల్యుఎస్‌- 423, యుఆర్‌- 1714 ఉన్నాయి. పూర్తి వివ‌రాల‌కు అభ్య‌ర్థులు https://scr.inidanrailways.gov.in/ వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.