ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. విశాఖ నుండి 42 ప్ర‌త్యేక రైళ్లు..

Special Trains: ప్రయాణికుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే శుభ‌వార్త‌నందించింది. వేస‌వి సెల‌వుల్లో  మొత్తం 42 వీక్లీ ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌పుననున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ రైళ్లు ఏప్రిల్ 13 నుండి మే నెలాఖ‌రు వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి. విశాఖ‌-బెంగ‌ళూరు, విశాఖ‌ప‌ట్నం-తిరుప‌తి, విశాఖ‌పట్నం-క‌ర్నూలు సిటి మ‌ధ్య ఈ ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌పనున్నారు.

విశాఖ‌-బెంగ‌ళూరు (08581/08582) ఆది, సోమ‌వారం అందుబాటులో ఉంటుంది.

దువ్వాడ‌, అన‌కాప‌ల్లి, య‌ల‌మంచిలి, సామ‌ర్ల‌కోట‌,రాజ‌మండ్రి, ఏలూరు, విజ‌య‌వాడ‌, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట‌, జోలార్‌పేట్ , కుప్పం, బంగారుపేట‌, కృష్ణ‌రాజ‌పురం స్టేష‌న్‌ల‌లో స్టాప్ ఉంది. 2 ఎసి, 3ఎసి, స్లీప‌ర్, జ‌న‌ర‌ల్ కోచ్‌లు క‌ల‌వు.

విశాఖ‌-తిరుప‌తి (08547/08548) బుధ‌, గురువారాల్లో ఈ రైలు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండ‌నుంది.

దువ్వాడ‌, అన‌కాప‌ల్లి, య‌ల‌మంచిలి, అన్న‌వ‌రం, సామ‌ర్ల‌కోట‌, రాజ‌మండ్రి, నిడ‌ద‌వోలు, త‌ణుకు, భీమ‌వ‌రం టౌన్‌, కైక‌లూరు, గుడివాడ‌, విజ‌య‌వాడ‌, తెనాలి, చీరాల‌, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీ‌కాళ‌హ‌స్తి, రేణిగుంట స్టేష‌న్‌ల‌లో ఆగుతుంది. 2 ఎసి, 3ఎసి, జ‌న‌ర‌ల్ కోచ్‌లు క‌ల‌వు.

విశాఖ‌-క‌ర్నూలు (08545/ 08546) మంగ‌ళ‌, బుధ వారాల్లో ఈ రైలు సర్వీసుల‌ను అందిస్తుంది.

దువ్వాడ‌, అన‌కాప‌ల్లి, తుని, అన్న‌వ‌రం, సామ‌ర్ల‌కోట‌, రాజ‌మండ్రి, ఏలూరు, విజ‌య‌వాడ‌, గుంటూరు, న‌ర‌సరావుపేట‌, వినుకొండ‌, మార్కాప‌రుం, కంభం, గిద్ద‌లూరు, దిగువ‌మెట్ట‌, నంద్యాల‌, డోన్ స్టేష‌న్‌ల‌లో ఆగుతుంది. 2 ఎసి, 3ఎసి, జ‌న‌ర‌ల్ కోచ్‌లు క‌ల‌వు.

Leave A Reply

Your email address will not be published.