పోస్టు వైరల్ : పిట్టకొంచెం కూత ఘనం
`పిట్టకొంచెం… కూత ఘనం` సామెతకు సరిగ్గా సరిపోతాడు ఈ బుడ్డోడు.. పిల్లలు అల్లరే చేస్తారు అనుకుంటాం.. కానీ అల్లరే కాదు శాస్త్రీయ సంగీతాన్ని కూడా అవలీలగా పాడగలరని నిరూపించాడు ఓ చిన్నోడు.. పిల్లలు తలచుకుంటే అసాధ్యమనేది ఏదీ లేదని అద్భుతంగా పాడి చూపించాడు. పాట పాడుతున్నంత సేపు ఎలాంటి బెరకు, వణుకు లేకుండా అవలీలగా తలలు పండని సంగీథ విధ్వాంసుడిలా పాడేస్తున్నాడు. ఇందతా ఎందుకు చెబుతున్నారా అని అనుకుంటున్నారా.. తాజాగా సంధ్య అనే జర్నలిస్ట్ షేర్ చేసిన బుడ్డోడి వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీడియోలో తండ్రి హార్మోనియం పెట్టెతో సంగీతం చేస్తూ కచేరీ సాగిస్తుంటాడు. తండ్రికి తగ్గట్టు పక్కనే ఉన్న కొడుకు కూడా పాట పాడుతూ ఉంటాడు. కొడుకంటే పెద్దోడనుకునేరు.. చాలా చిన్నోడు నిండా నాలుగేళ్లు కూడా ఉండవు.. బుడ్డోడు పాట పాడుతూ హావభావాలతో ఆకట్టుకుంటాడు. మధ్యలో ఒకసారి తండ్రి పాటను వేగంగా పాడడంతో బుడ్డోడు మధ్యలో కల్పించుకొని కొంచెం స్లోగా పాడితే బాగుంటుంది అంటూ తండ్రితో చెప్పాడు.
ఈ సోషల్ మీడియాలో షేర్ చేసిన రెండు గంటల్లోనే 24వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన సోషల్ మీడియా అభిమానులు చిన్నోడి పాటను చూసి తెగ మురిసి పోతున్నారు. బుడ్డోడి పాటకు ఫిదా అవుతున్నారు. ఆ బుడ్డోడు అంత బాగా పాటలు పాడడం వెనుక హార్మోనియం వాయిస్తున్న తండ్రి కృషి ఎంత ఉందో అర్థమవుతూనే ఉందని, భవిష్యత్లో గొప్ప సంగీత విధ్వాంసుడు అవుతాడని ఇలా రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆలస్యమెందుకు మీరూ ఓ లుక్కేయండి. ఎంజాయ్ చేయండి.
❤️❤️❤️😀😀😀😀😍😍😍
Little fella has no chill pic.twitter.com/ytp2q5PvbT
— Sandhya (@TheRestlessQuil) October 18, 2020