Madhapur: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 44 మంది విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): నగ‌రంలోని రెండు వేర్వేరు పాఠ‌శాల‌లో విద్యార్థులు అస్వస్థ‌త‌కు గురయ్యారు. మాదాపూర్ చందానాయ‌క్ తండ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోని విద్యార్థులు మ‌ధ్యాహ్న భోజ‌నం తిన్న త‌ర్వాత 44 మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వీరిని కొండాపూర్ ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో ఆరుగురి ప‌రిస్తితి విష‌మంగా ఉండ‌టంతో ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు స‌మాచారం.

మ‌రోవైపు న‌గ‌రంలోని బాగ్‌లింగంప‌ల్లి మైనార్టి గురుకుల పాఠ‌శాల‌లోని ఏడుగురు విద్యార్థుల‌కు పుడ్ పాయిజ‌న్ అయిన‌ట్లు స‌మాచారం. రాత్రి భోజ‌నం చేసిన త‌ర్వాత వాంతులు, విరోచ‌నాలు, క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతున్నారు. దీంతో ఆప్ర‌మ‌త్త‌మై నిలోఫ‌ర్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు . వీరి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు ఆస్ప‌త్రి సూన‌రింటెండెంట్ తెలిపారు.

 

Sports News:  U19 Asia Cup: 234 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం

1 Comment
  1. […] Madhapur: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 44 మంది విద్య… […]

Leave A Reply

Your email address will not be published.