పోస్ట‌ల్ శాఖ‌లో 44 వేల పోస్టులు

దేశ‌వ్యాప్తంగా వివిధ పోస్ట‌ల్ శాఖ‌ల్లో 44,228 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేరకు గ్రామీణ డాక్ సేవ‌క్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. బ్రాంచ్ పోస్టుల మాస్ట‌ర్ , అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ డాక్ సేవ‌క్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. పోస్టు మాస్ట‌ర్ పోస్టుకు నెల‌కు వేత‌నం రూ. 12,000 నుండి రూ. 29,380 వ‌ర‌కు.. అసిస్టెంట్ పోస్టు మాస్ట‌ర్ / డాక్ సేవ‌క్ పోస్టుకు రూ. 10,000 నుండి రూ. 24,470 వ‌ర‌కు ఉంటుంది. ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన వారు 18 నుండి 40 ఏళ్లు ఉండాలి. ఎస్‌సి, ఎస్‌టిల‌కు ఐదేళ్లు , ఒబిసిల‌కు మూడేళ్లు , దివ్యాంగుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ట య‌సులో స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది. అభ్య‌ర్థులు ప‌దోత‌ర‌గ‌తిలో సాధించిన మెరిట్ లిస్ట్ మార్కుల ఆధారంగా ఎంపిక జ‌రుగుతుంది. ఆగ‌స్టు 5వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివ‌రాల‌కు https//indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.