1981 నాటి ఊచకోత కేసు.. దోషులకు మరణశిక్ష

లఖ్‌నవూ (CLiC2NEWS): 40 ఏళ్లనాటి ఊచకోత కేసులో ఉత్తర్‌ప్రదేశ్ ప్రత్యేక న్యాయస్థానం మైన్‌పురీ కోర్టు.. ఇటీవల ముగ్గురిని దోషులుగా తేల్చి, వారికి మరణ శిక్ష విధించింది. దీంతో పాలు రూ.50వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో తొలుత 17 మంది నిందితులపై హత్య, హత్యాయత్నం, దోపిడి సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కానీ కేసు విచారణ సుదీర్థకాలం పాటు కొనసాగుతుండగా.. 14 మంది నిందితులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురికి తాజాగా మరణ శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని దిహులీలో 1981 నవంబర్ 18న 24 మంది దళితులు ఊచకోతకు గురయ్యారు. ఖాకీ దుస్తుల్లో వచ్చిన 17మంది ఓ దళిత కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ఆ దారుణానికి ఒడిగట్టారు. మరణించిన వారిలో చిన్నారులు, మహిళలు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఆ దారుణ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి సంఘీభావంగా బిజెపి అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయి పాదయాత్ర కూడా చేశారు.