తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నమోదయిన కేసులు..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,20,243 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 4,416 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మోత్తం కేసుల సంఖ్య 7,26,819కి చేరింది. ఒక్కరోజులో ఇద్దరు కరోనాతో మరణించారు. దీంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,069కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఈవైరస్ బారి నుండి 1,920 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,127 యాక్టివ్ కేసులున్నాయి. ఈమేరకు వైద్యారోగ్య శాఖ బుటిటెన్ విడుదల చేసింది. ఒక్కరోజులో జిహెచ్ ఎంసి పరిధిలో 1,670 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.