తెలంగాణలో భానుడి భగభగలు.. 45 డిగ్రీల ఉష్ణోగ్రత
హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. హైదరాబాద్ , రాజమండ్రిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత పెరిగింది. ఉత్తర తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 11 జిల్లాల్లో మూడు రోజులుగా 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి. అంతే కాకుండా రాష్ట్రంలో వడదెబ్బ బారిన పడి ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. రానున్న బుధ, గురు వారాల్లో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండనున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎపిలో నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో గరిష్టంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాడానికే బయపడుతున్నారు. ఉదయం 11 గంటలు దాటితే రాహదారులు వెలవెలబోతున్నాయి. బయట పనిచేసేవారు ఎండ తీవ్రతను భరించలేకపోతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు వాతావరణం వేడిగా ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉంటున్నాయి.