బెల్‌లో 45 ఇంజినీర్ పోస్టులు

BEL: రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) లో 45 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయుటకు దరఖాస్తులు కోరుతుంది.
రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ప్రతిభ చూపిన ఆధారంగా 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ లో అర్హత సాధించిన వారిని వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. రెండు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మార్చి 12లోపు పంపించాల్సి ఉంది.
సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్లో బిఇ/ బిటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగానుభవం ఉండాలి.
ట్రెయినీ ఇంజినీర్ పోస్టులు 45.. ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులు 3 కలవు.
ట్రెయినీ ఇంజినీర్.. 1.2.2025 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఈ పోస్టుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన రెండేళ్లు ఉద్యోగంలో నియమిస్తారు. కాలపరిమితిని మరో ఏడాది పాటు పొడిగిస్తారు. ట్రెయినీ ఇంజినీర్ పోస్టుకు దరఖాస్తు ఫీజు రూ.177. ఎస్‌సి, ఎస్‌టి , దివ్యాంగులకు ఫీజు లేదు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం మొదటి ఏడాది రూ. 30వేలు.. రెండో ఏడాది రూ. 35 వేలు ఉంటుంది.
ప్రాజెక్టు ఇంజినీర్.. 1.2.2025 నాటికి అభ్యర్థుల వయస్సు 32 సంవత్సరాలకు మించకూడదు. ఈ ఉద్యోగాలకు మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగంలో నియమిస్తారు. మరో ఏడది కాలపరిమితిని పొడిగిస్తారు. ఆన్ లైన్ దరఖాస్తు ఫీజు రూ. 472. ఎస్‌టి, ఎస్‌సి, దివ్యాంగులకు ఫీజు చెల్లించనవసరం లేదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం మొదటి ఏడాది రూ.40వేలు, రెండో ఏడాది రూ. 45వేలు.. మూడో ఏడాది రూ. 50వేలు చెల్లిస్తారు.
రాత పరీక్ష, సిలబస్ , పరీక్ష కేంద్రాలు.. తదితర పూర్తి వివరాలకు అభ్యర్థులు www.bel-india.in వెబ్‌సైట్ చూడగలరు.