వైఎస్ఆర్‌టిపి నుండి మూకమ్మడి రాజీనామాలు..!
హైదరాబాద్ (CLiC2NEWS): వైఎస్ ఆర్ పేరును షర్మిల చెడగొట్టారిన సీనియర్ నేత గట్టు రామచంద్రరావు విమర్శించారు. వైఎస్ ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల .. కాంగ్రెస్‌కు మద్దతు తెలిపేందుకు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ నేతలు మూకమ్మడిగా రాజీనామాకు సిద్దమయినట్లు సమాచారం. పార్టీ సీనియర్ నేత గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ.. ముందుగా సొంతంగా అన్ని చోట్లా పోటీ చేద్దామని, తర్వాత కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని ప్రకటించిన షర్మిల.. చివరకు పార్టీని నమ్ముకున్న వారిని రోడ్డున నిలబెట్టారని విమర్శించారు. ఇన్ని రోజులూ షర్మిలను నమ్మి సహకరించినందుకు ప్రజలకు క్షమాపణ చెబుతున్నామని.. షర్మిలను తెలంగాణ నుండి బహిష్కరిస్తున్నామన్నారు. పార్టీ కోసం రూ. లక్షలు ఖర్చు పెట్టామని మహిళలు సైతం ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 45 మంది వైఎస్ ఆర్‌టిపి కో- ఆర్డనేటర్లు పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు.