మహారాష్ట్రలో 453 కేజీల‌ భారీ బాంబు.. నిర్వీర్యం చేసిన అర్మి

 

మహారాష్ట్రలోని వ‌ర్వాండి గ్రామంలోని పొలంలో ఉన్న 453 కేజీల‌ భారీ బాంబును ఆర్మీ అధికారులు న‌ర్వీర్యం చేశారు. ఓ రైతు పొలంలో భారీ పేలుడు ప‌దార్ధం ఉన్న‌ట్లు గుర్తించారు. మార్చి 28వ తేదీన ఆ రైతు పేలుడు పదార్ధం గురించి రెవెన్యూ అధికారికి స‌మాచారం ఇచ్చాడు. భూమిలో ఆర‌డుగుల లోప‌ల బాంబు పిన్ క‌నిపించింద‌ని అత‌డు పేర్కొన్నాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ఉన్న‌తాధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న అధికారులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అక్క‌డ భారీ పేలుడు ప‌దార్ధం ఉన్న‌ట్లు గుర్తించారు.

బాంబు పేలే అవ‌కాశం ఉన్నందున అధికారులు ప్ర‌జ‌ల‌ను ఆప్ర‌దేశం నుండి దూరంగా త‌ర‌లించారు. బాంబును వెలికి తీయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వ అనుమ‌తి కోరారు. పుణె నుండి 10 మంది వైమానికి , ఆర్మి ద‌ళ అధికారులు వ‌ర్వాండి గ్రామానికి చేరుకుని నెల రోజుల పాటు శ్ర‌మించి ఆ బాంబు ను నిర్వీర్యం చేశారు. జెసిబి సాయంతో బాంబు చుట్టూ ఏడ‌డుగుల గొయ్యి తీశారు. బాంబు స్కాడ్ బృందాలతో దానిని నిర్వీర్యం చేసిన‌ట్లు స‌మాచారం. ఆ బాంబు న‌లుగ‌న్న‌ర అడుగుల పొడ‌వు, నాల‌గు అడుగుల వ్యాసం , 453 కిలోల బ‌రువున్న‌ట్లు తెలిపారు. ఆ బాంబు పేలి ఉంటే కిలో మీట‌రు మేర ఉన్న ఇల్లు పూర్తిగా ధ్వంస‌మై ఉండేవి. భూమిలో భారీ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించేవ‌ని తెలిపారు. ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా పెను ప్ర‌మాదాన్ని త‌ప్పంచింనందుకు రైతును అధికారులు అభినందించారు. అయితే బాంబు అక్క‌డికి వెలా వ‌చ్చింద‌నే అంశంపై ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.