AP: కొత్తగా 4,570 కొవిడ్ కేసులు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30,022 నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. తాజాగా 4,570 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా ఒకరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 669 మంది ఈ వైరస్ నుండి కోలుకున్నారిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,770 యాక్టివ్ కేసులు ఉన్నాయి.