46వేల పాయింట్లు దాటిన సెన్సెక్స్

ముంబయి: గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో దూసుకుపోతున్నాయి. ఈరోజు (సోమవారం ) కూడా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 210.60 పాయింట్లు అంటే 0.46 శాతం లాభపడి 46,309.61 పాయింట్ల వద్ద, నిఫ్టీ 65.50 పాయింట్లు అంటే 0.48శాతం ఎగిసి 13,579.40 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 1292 షేర్లు లాభాల్లో, 255 షేర్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 60 షేర్లలో ఎలాంటి మార్పులేదు. సెన్సెక్స్ గతవారం 46వేల పాయింట్లని క్రాస్ చేయగా, వారం మొత్తంలో సెన్సెక్స్ 1,019.46 పాయింట్లతో 2.26 శాతం లాభపడింది. ఇవాళ కూడా 46వేల పాయింట్లకు పైనే కదలాడింది.