రైల్వేలో 4,660 పోస్టులు..
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్లో 4,660 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 14వరకు అప్లయ్ చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులు 4,208 ఉండగా.. ఎస్ఐ పోస్టులు 452 ఉన్నాయి. కానిస్టేబుల్ అభ్యర్థులకు 28 ఏళ్లకు మించరాదు. ఎస్ ఐ అభ్యర్థులకు 20 నుండి 28 ఏళ్ల వయస్సు ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు రూ. 21,700, ఎస్ ఐ పోస్టులకు రూ. 35,400 చొప్పున ప్రారంభ వేతనంగా ఉంది.