48 అడుగుల దాటి ప్రవహిస్తున్న వరద నీరు
48 అడుగుల దాటి ప్రవహిస్తున్న వరద నీరు

భద్రాచలంః భద్రాచలం వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం ఉదయం 9 గంటలకు 50 అడుగులు ప్రవహిస్తోందని ఈ ఉదయం 48 అడుగుల దాటి ప్రవహిస్తున్నందున రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశామన్నారు. 53 అడుగులు చేరుకుంటే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తామని చెప్పారు. గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్నందున మధ్యాహ్నం వరకు 53 అడుగులు వచ్చే అవకాశం ఉందని మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నదని అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శనివారం తెల్లవారుజామున నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో కేంద్ర జల వనరుల శాఖ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, సాయంత్రం 6 గంటలకు 46 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరికకు రెండు అడుగుల దూరంలోనే ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఆ నీటిని సైతం గోదావరిలోకే వదులుతుండటంతో నది ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే పాలేరు, వైరా రిజర్వాయర్లు అలుగుపోస్తున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టుకు గరిష్ట స్థాయిలో నీరు చేరడంతో 12 గేట్లు ఎత్తి 86 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ప్రాజెక్టు పరిధిలోని 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 2016 తర్వాత ఒకేసారి 12 గేట్లు ఎత్తడం ఇదే ప్రథమం. ఇక జిల్లావ్యాప్తంగా శనివారం 16.18 సెం.మీ. వర్షపాతం నమోదైంది.