సింగ‌రేణిలో 485 పోస్టులు.. రేపే నోటిఫికేష‌న్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): సింగ‌రేణిలో 485 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డానికి రేపు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సిఎండి తెలిపారు. వీటిలో 317 డైరెక్ట్‌, 168 ఇంట‌ర్న‌ల్ పోస్టులు ఉన్నాయి. సింగ‌రేణిలో అభివృద్ది, సంక్షేమంపై ఉప ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ ఏడాది సింగ‌రేణిలో 1000 వార‌స‌త్య ఉద్యోగాలు ఇవ్వాల‌ని, వ‌యోప‌రిమితి 40 ఏళ్లకు పెంపుపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని బుధ‌వారం రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క సూచించారు. కార్మికుల‌కు ప్ర‌మాద బీమా రూ. కోటి పై రేపు యుబిఐతో ఒప్పందం జ‌ర‌గ‌నుంద‌ని తెలిపారు.

ఫిబ్ర‌వ‌రి 26వ తేదీన కొత్త‌గూడెంలో 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ప్రారంభం, హైద‌రాబాద్‌లో సింగ‌రేణి అతిథిగృహం నిర్మాణానికి త్వ‌ర‌లో భూమి పూజ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. వేస‌విలో థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల‌కు బొగ్గు కొర‌త లేకుండా చూడాల‌ని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.