హైవేస్ మేనేజ్మెంట్ లో ఇంజినీర్ పోస్టులు

IHMCL: ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెని లిమిటెడ్‌లో 49 ఇంజినీర్ పోస్టులు కలవు. ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్-ఐటిఎస్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
మొత్తం పోస్టులు 49
అన్ రిజర్వ్డ్ – 21
ఒబిసి – 13
ఎస్సిలకు – 7
ఎస్టిలకు -3
ఆడబ్ల్యుఎస్లకు -6 కలవు.
21 నుండి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను జూన్ 2వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. ఎస్సి/ ఎస్టిలకు ఐదేళ్లు, ఒబిసిలకు మూడేళ్లు సడలింపు ఉటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు , దివ్యాంగులకు పది నుండి పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది.
గేట్ లో చూపిన ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తుల సంఖ్య పెరిగితే ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంటుంది.
ఎంపికైన వారికి నెలకు రూ. 40 వేల నుండి రూ.లక్షా నలభై వేల వరకు వేతనం అందుతుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజి/ కంప్యూటర్ సైన్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ / ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌తో బిఇ, గేట్ -2025 స్కోర్ ఉండాలి.
ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం http://www.ihmcl.co.in./ వెబ్సైట్ చూడగలరు.