తెలంగాణలో 494 కొవిడ్ కేసులు
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజగా గురువారం 28,865 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 494 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జిహెచ్ ఎంసి పరిధిలోనే 315 కేసులు నమోదవటం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుతం 3,048 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మరోవైపు దేశంలో 13,313 కొత్త కేసులు నమోదయ్యాయి.
కేంద్రంలో కేసులు సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాజిటివిటీ రేటు ఎక్కువుగా ఉన్న జిల్లాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.