ఎయిర్‌పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియాలో 496 జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు..

Junior Executive: బిఎస్‌సి బిటెక్ అర్హ‌త‌తో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (విమాన రాక‌పోక‌లు) విభాగంలో ఉద్యోగాలను పొందే అవ‌కాశం. ఎయ‌ర్‌పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియా.. ఎయిర్ ప‌పోర్లు స‌మ‌ర్థ నిర్వ‌హణలో జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న వెలువ‌డింది. మొత్తం 496 పోస్టులు క‌ల‌వు. ఈ పోస్టుల‌కు ఎంపికైన వారు వేత‌నం, డిఎ, హెచ్ ఆర్ ఎ, ఇత‌ర ప్రోత్సాహ‌కాలతో క‌ల‌పి వార్షిక వేత‌నం రూ. 13 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది.

మొత్తం 496 పోస్టులు

అన్ రిజ‌ర్వ్‌డ్ 199, ఒబిసి ఎన్‌సిఎల్ 140, ఇడ‌బ్ల్యుఎస్ 49, ఎస్‌సి 75, ఎస్‌టి 33 పోస్టులు క‌ల‌వు. అభ్య‌ర్థులు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తో బిఎస్‌సి లేదా బిఇ బిటెక్ 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌లై ఉండాలి. ఆంగ్ల భాష‌లో రాత‌, మాట్లాడే నైపుణ్య‌లు అవ‌స‌రం. వ‌య‌స్సు 30 నవంబ‌ర్ 2023 నాటికి 27 ఏళ్లు మించ‌రాదు. అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ న‌వంబ‌ర్ 30 గా నిర్ణ‌యించారు. ద‌ర‌ఖాస్తు రుసుం రూ. వెయ్యి . మ‌హిళ‌లు, ఎస్‌సి, ఎస్‌టి, దివ్యాంగులు చెల్లించ‌న‌వ‌సంలేదు. పూర్తి వివ‌రాల‌కు jttps://www.aai.aero/en/careers/recruit వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.