ఎస్‌బిఐ నుండి మరో 500 బ్రాంచ్‌లు.. నిర్మలా సీతారామన్
ముంబయి (CLiC2NEWS): దేశవ్యాప్తంగా మరో 500 ఎస్‌బిఐ బ్రాంచ్‌లను విస్తరింపచేయనున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను నుండి మరో 500 బ్రాంచీలు ప్రారంభించనున్నారు. దీంతో ఈ బ్యాంకు బ్రాంచ్‌లు సంఖ్య 23వేలకు చేరనున్నట్లు సమాచారం. 1921లో 250 బ్రాంచీలతో ఉండగా.. ఇప్పుడా సంఖ్య 22,500 చేరిందని, వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి మరో 500 బ్రాంచీలు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి వివరించారు. ఎస్‌బిఐ ప్రధాన కార్యాలయం 100వ వార్షికోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. శత వార్షికోత్సవం సందర్భంగా రూ.100 స్మారక నాణెం ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎస్‌బిఐకి 50 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారని, దేశంలోని మొత్తం డిపాజిట్లలో బ్యాంకు వాటా 22.4% గా ఉందని తెలిపారు. 1921వ సంవత్సరంలో బ్యాంకు ఏవిధంగా విస్తరించిందో మంత్రి గుర్తుచేశారు. మూడుప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ()గా ఏర్పాటయింది. ఆ తర్వాత 1955లో పార్లమెంట్‌లో చట్టం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ముందుగా 250 బ్రాంచ్‌లోత మొదలయ్యి.. 23 వేల బ్రాంచ్‌లకు చేరింది. ఇపుడు మరో 500 బ్రాంచ్‌లు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.