భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో 515 పోస్టులు
BHEL: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బిహెచ్ఇఎల్)లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో ఈ పోస్టులు కలవు.
పదో తరగతిలో 60% తో ఉత్తీర్ణత. ఫిట్టర్/ వెల్డర్ / టర్నర్/ మెషినిస్ట్/ ఎలక్ట్రీషియన్/ ఎలక్ట్రానిక్స్ / మెకానిక్ / ఫౌండ్రీమెన్ ట్రేడుల్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్/ ఐటిఐ/ , నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ (ఎన్ ఎసి) ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తులను ఆగస్టు 12వ తేదీ లోపు పంపించాల్సి ఉంది.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ , ధ్రువ పత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు రూ.1,072 గా నిర్ణయించారు. ఎస్‌సి/ ఎస్‌టి / దివ్యాంగులు/ మాజి సైనికోద్యోగులకు రూ. 472 గా నిర్ణయించారు.
మొత్తం పోస్టులు 515
ఫిట్టర్ – 176
వెల్డర్ – 97
టర్నర్ – 51
మెషినిస్ట్ – 104
ఎలక్ట్రీషియన్ – 65
ఎలక్ట్రానిక్స్ , మెకానిక్ -18
ఫౌండ్రీమెన్ – 4
ఈ పోస్టులకు ఎంపికైన వారు దేశ వ్యాప్తంగా ఉన్న రాణిపేట్, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, భోపాల్, వారణాసి, జగదీశ్‌పూర్, హరిద్వార్, ఝాన్సీ , తిరుచిరాపల్లిలో ఉన్న యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 1.7.2025 నాటికి 27 ఏళ్లు మించకూడదు. ఒబిసిలకు మూడేళ్లు.. ఎస్‌సి / ఎస్‌టిలకు ఐదేళ్లు.. దివ్యాంగులకు పది నుండి పదిహేనేళ్లు , ఉద్యోగానుభవం ఉన్నవారికి ఏడేళ్లు సడలింపు ఉంటుంది.
ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు వేతనం రూ.29,500 నుండి రూ.65 వేల వరకు ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగాలుగా సంవత్సరం పాటు కనీస వేతనంతో పనిచేయాల్సి ఉంటుంది. అనంతరం ఆర్టిసన్ గ్రేడ్-4 గా శాశ్వతంగా నియమిస్తారు.