వైద్యారోగ్య శాఖ‌లో 5,348 పోస్టులు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ వైద్య‌, ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ‌లో 5,348 పోస్టులు భ‌ర్తీ చేసేందుకు ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. ఈ పోస్టుల‌ను వైద్యారోగ్య స‌ర్వీసుల నియామ‌క బోర్డు ద్వారా నేరుగా భ‌ర్తీ చేప‌ట్ట‌నున్నారు. ఈ మేర‌కు ఆర్ధిక‌శాఖ ప్రత్యేక కార్య‌ద‌ర్వి జిఓ విడుద‌ల చేశారు. ప్ర‌జారోగ్యం, ఆయుష్‌, డిసిఎ, ఐపిఎం, డిఎంఇ, వైద్య విధాన ప‌రిష‌త్‌, ఎంఎన్ జె క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వీటికి సంబంధించిన అర్హ‌త, స్థానిక‌త ఆధారంగా ఆయా విభాగాల అధిప‌తులు నుండి వివ‌రాల‌ను సేక‌రించానున్నారు. త్వ‌ర‌లో నేటిఫికేష‌న్ ఇచ్చి నేరుగా పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.