టిటిడిలో 56 ఇంజినీర్ పోస్టులు..

తిరుమ‌ల (CLiC2NEWS): తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో 56 ఇంజినీర్ల పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ మేర‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎపిలోని హిందూ మ‌తానికి చెందిన అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు అర్హులుగా పేర్కొన్నారు. అభ్య‌ర్థులు వ‌య‌స్సు 42 ఏళ్లకు మించ‌రాదు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ 27 పోస్టులు, 10 అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్‌), 19 అసిస్టెంట్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ (సివిల్) పోస్టుల‌కు .. బిఇ, బిటెక్ (సివిల్, మెకానిక‌ల్‌), ఎల్‌సిఇ ఎల్ ఎంఇ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణ‌లైన అభ్య‌ర్థులు అర్హులు. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూల ద్వారా ఎంపిక జ‌రుగుతుంది. ఎఇఇ పోస్టుల‌కు రూ 57,100-1,47,760.. ఎఇకి రూ. 48,440-1,37,220.. ఎటిఒ పోస్టుల‌కు రూ. 37,640-1,15,500 వ‌ర‌కు నెల‌కు చెల్లిస్తారు. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు నవంబ‌ర్ 23లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.