6 వారాల్లో ప్రపంచ దేశాలకు 8 కోట్ల వ్యాక్సిన్లు: జోబైడెన్‌

వాషింగ్టన్‌: వచ్చే ఆరువారాల్లో ప్రపంచ దేశాలకు 8 కోట్ల కొవిడ్‌ టీకా డోసులు అమెరికా అంద‌జేయ‌నుంది. ఈ మేర‌కు సోమ‌వారం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రకటించారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌తో పాటు ఫైజర్‌ బయో ఎన్‌టెక్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్స్‌ టీకాలు అందించనున్నట్లు ఆయ‌న తెలిపారు.

ఈ మేర‌కు సోమ‌వారం ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

‘అన్ని దేశాల్లో క‌రోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటే.. అమెరికా సైతం క్షేమంగా ఉండలేదని పేర్కొన్నారు. రానున్న 6 వారాల్లో 80 మిలియన్ల వాక్సిన్ల‌ను ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తాం’ అని ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం అమెరికాలో ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్లు వినియోగిస్తున్నారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు ఆమోదం లభించలేదు. 60 మిలియన్‌ మోతాదుల నిల్వ ఉండగా.. ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అథారిటీ (ఎఫ్‌డీఏ) క్లియరెన్స్‌ కోసం ఎదురు చూస్తోంది.

Leave A Reply

Your email address will not be published.