బాస‌ర ట్రిపుల్ ఐటిలో 600 మంది విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌

బాస‌ర (CLiC2NEWS): నిర్మ‌ల్ జిల్లాలోని బాస‌ర ఆర్‌జియుకెటిలో మ‌ధ్యాహ్న భోజ‌నం విక‌టించి 600 మందికి పైగా విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. మ‌ధ్యాహ్నం భోజ‌నం క‌లుషితం కావ‌డం వ‌ల‌న విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని ప్రాథ‌మికంగా గుర్తించారు. పియుసి-1, పియుసి-2 విద్యార్థుల మెస్‌ల్లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ రెండు మెస్‌ల‌కు ఒకేచోట భోజ‌నం త‌యారు చేస్తారు. భోజ‌నం తిన్న విద్యార్థుల‌కు వాంతులు, విరేచ‌నాలు అయ్యి స్పృహ త‌ప్పి ప‌డిపోయారు. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు క్యాంప‌స్‌లోనే ప్రాథ‌మిక వైద్యం అందించారు. కొంద‌రు విద్యార్థుల‌ను నిజామాబాద్ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌నందిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.