నిఖత్ జరీన్‌కు 600 గజాల స్థలం.. త్వరలో గ్రూప్-1 ఉద్యోగం

హైదరాబాద్ (CLiC2NEWS): బాక్సర్ నిఖత్ జరీన్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూబ్లిహిల్స్‌లో 600 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చింది. అంతే కాకుండా గ్రూప్-1 కేడర్‌కు చెందిన ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నిఖత్ జరీన్ ప్రపంచ మహిళా బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసినదే. అంతర్జాతీయ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్న నిఖత్‌కు గతేడాది రూ. కోట్ల నగదు చెక్కును సిఎం కెసిఆర్ అందించారు. ఇంటి స్థలాన్ని కూడా కేటాయించనున్నట్లు ప్రకటించారు.
భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన తెలంగాణ బిడ్డ నిఖత్‌కు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర క్రీడా శాఖ తరపున ఇంటి స్థలాన్ని కేటాయించింది. దీనికి సంబంధించిన పత్రాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం ఆమె తండ్రికి అందజేశారు.త్వరలో నిఖత్‌కు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు.