ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 క్ల‌ర్కు పోస్టులు

Bank Posts: దేశ‌వ్యాప్తంగా ఉన్న‌టువంటి ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌నెల్ సెల‌క్ష‌న్ (IBPS) ద్వారా పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు ఎపిలో 105, తెలంగాణ‌లో 104 పోస్టులు ఉన్నాయి. ప్రిలిమిన‌రి, మెయిన్స్ రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థ‌లను ఎంపిక చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హ‌త‌తో పాటు కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి. వ‌య‌స్సు 28 ఏళ్ల లోపు వారై ఉండాలి. ఫీజు రూ. 850గా నిర్ణ‌యించారు. ఎస్‌సి ఎస్‌టి దివ్యాంగులు, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ల‌కు రూ. 175 గా ఉంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ జులై 21. ఎపిలో ప‌రీక్ష కేంద్రాలు.. విజ‌య‌వాడ‌, క‌ర్నూలు, గుంటూరు, విశాఖ ప‌ట్టణం. తెలంగాణ‌లో హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌.
ఆన్‌లైన్ ప‌రీక్ష ఆగ‌స్టు 24,25,31 తేదీల‌లో నిర్వ‌హించ‌నున్నారు. మెయిన్స్ ప‌రీక్ష అక్టోబ‌ర్ 13వ తేదీన నిర్వ‌హిస్తారు.

Leave A Reply

Your email address will not be published.