ప్ర‌భుత్వ రంగ సంస్థ.. హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో 63 పోస్టులు

హెచ్ ఎల్ ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ .. ఒప్పంద ప్రాతిప‌దిక‌న 63 పోస్టుల భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎపి,తెలంగాణ‌తోపాటు త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, గోవా, మ‌ధ్య‌ప్రదేశ్‌, మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, గుజ‌రాత్‌, పంజాబ్‌, డిల్లీ ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ , రాజ‌స్థాన్‌ల‌లో ప‌నిచేయుట‌కు హిందీ ట్రాన్స్‌లేట‌ర్ , ఏరియా సేల్స్ మేనేజ‌ర్ / అసిస్టెంట్ రీజిన‌ల్ మేనేజ‌ర్ / డిప్యూటి మేనేజ‌ర్‌, బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ / స‌ర్వీస్ పోస్టులు క‌ల‌వు. పోస్టును అనుస‌రించి సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు ప‌ని అనుభ‌వం ఉండాలి. జులై 17లోపు ద‌ర‌ఖాస్తుల‌ను పోస్టు ద్వారా కాని, ఇ మెయిల్ ద్వారా కాని పంపించాలి. చిరునామా డిజిఎం (హెచ్ ఆర్‌) హెచ్ ఎల్ ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌, హాల్‌భ‌వ‌న్‌, చి26/4 వెల‌చేరీ తంబంరం మెయిన్‌రోడ్ , ప‌ల్లిక‌ర‌నై, చెన్నై.

హిందీ ట్రాన్స్‌లేట‌ర్‌కు రూ. 18,000. బిజెనెస్ డెవెల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ -4 పోస్టుల‌కు రూ. 22,000.. బిజెనెస్ డెవెల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ -3 పోస్టుల‌కు రూ. 21,000,, బిజెనెస్ డెవెల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ -5, ఏరియా సేల్స్ మేనేజ‌ర్‌ పోస్టుల‌కు రూ. 23,000.. అసిస్టెంట్ మేనేజ‌ర్‌కు రూ. 30,000.. డిప్యూటి మేనేజ‌ర్ పోస్టుల‌కు రూ. 32,500 గా ఉంది.

Leave A Reply

Your email address will not be published.