ఇస్రోలొ కొలువులు

 

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఇస్రో) లో సైంటిస్ట్ / ఇంజినీర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. సైంటిస్ట్/ ఇంజినీర్ ఎస్‌సి/ (ఎల‌క్ట్రానిక్స్‌)-22, సైంటిస్ట్ / ఇంజినీర్ ఎస్‌సి (మెకానిక‌ల్‌) -33, సైంటిస్ట్/ ఇంజినీర్ ఎస్‌సి (కంప్యూట‌ర్ సైన్స్‌) -8 క‌లిపి మొత్తం 63 పోస్టులు ఉన్నాయి.

బిఇ/ బిటెక్ / త‌త్స‌మాన ప‌రీక్ష 65శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులైన‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్యర్థులకు 2024 లేదీ 2025 గేట్ స్కోర్ ఉండాలి.

ఎంపికైన వారిని హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, తిరువ‌నంత‌పురం, మ‌హేంద్ర‌గిరి, అహ్మ‌దాబాద్‌, హ‌స‌న్‌, వ‌లియ‌మ‌ల, శ్రీ‌హ‌రి కోట కేంద్రాల్లో పోస్టింగ్ ఉండ‌నుంది.

ఎంపిక – గేట్ స్కోర్ ఆధారంగా 1:7 నిష్ప‌త్తిలో ఇంట‌ర్వ్యూల‌కు ఎంపిక చేస్తారు.
ఇంట‌ర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి. టెక్నిక‌ల్ (అక‌డ‌మిక్) నాలెడ్జ్ 40 మార్కులు, జ‌న‌ర‌ల్ అవ‌ర్‌నెస్‌కు 20 మార్కులు, ప్ర‌జెంటేష‌న్/ క‌మ్యూనికేష‌న్ స్కిల్‌కు 20 మార్కులు , కాంప్ర‌హెన్ష‌న్‌కు 10 మార్కులు, అక‌డ‌మిక్ అచీవ్‌మెంట్స్‌కు 10 మార్కులు ఉంటాయి.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్తుల వ‌య‌స్సు 28 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు. ద‌ర‌ఖాస్తుల‌ను మే 19వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. ద‌ర‌ఖాస్తు రుసుం రూ. 250. ఎస్‌టి/ ఎస్‌సి / దివ్యాంగులు/ మాజి సైనికోద్యోగులు / మ‌హిళ‌ల‌కు ఫీజు లేదు.

ఈ ఉద్యోగాల‌కు ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ.56,100 అందుతుంది. మూల వేత‌నానికి అద‌నంగా డిఎ, హెచ్ ఆర్ ఎ, టిఎ, న్యూ పెన్ష‌న్ స్కీమ్/ యూనిఫైడ్ పెన్ష‌న్ స్కీమ్‌, వ్య‌క్తిగ‌త , కుటుంబ స‌భ్యుల‌కు వైద్య స‌దుపాయాలు, ఎల్‌టిఎ, గ్రూప్ ఇన్సూరెన్స్‌, హౌస్‌బిల్డింగ్ అడ్వాన్స్ మొద‌లైన స‌దుపాయాలు ఉంటాయి.

మెరిట్ బేస్డ్ ప‌ర్ఫార్మెన్స్ రివ్యూ సిస్ట‌మ్ ద్వారా ప్ర‌తిభ ఆధారంగా ఉద్యోగులు ప‌దోన్న‌తులు పొందే అవ‌కాశం ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.