స్పోర్ట్స్ కోటాలో వెస్టర్న్ రైల్వేలో 64 పోస్టులు
వెస్టర్న్ రైల్వే (Western Railway) ముంబయి, స్పోర్ట్స్ కోటాలో వివిధ విభాగాల్లో మొత్తం 64 పోస్టులు ఉన్నాయి.
గ్రూప్-సి: 21, గ్రూప్-డి: 43 ఖాళీలు ఉన్నాయి. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాక్సింగ్ , గోల్ఫ్ , కబడ్డీ, రెజ్లింగ్, షూటింగ్ , సైక్లింగ్ , హాకీ, క్రికెట్ , వాలీబాల్ క్రీడా విభాగాల్లో ప్రతిభ చూపిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 29. దరఖాస్తు ఫీజు రూ. 500గా ఉంది. ఎస్ సి, ఎస్ టి, మైనారిటి , ఇబిసి అభ్యర్థులకు రూ. 250గా నిర్ణయించారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్, క్రీడా ప్రదర్శనతో ఎంపిక నిర్వహిస్తారు.
పోస్టును అనుసరించి అభ్యర్థులు డిగ్రీ, ఇంటర్, టెన్త్ , ఐటిఐ అర్హత కలిగిఉండాలి.
అభ్యర్థుల వయస్సు 2025 1వ తేదీ నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
[…] స్పోర్ట్స్ కోటాలో వెస్టర్న్ రైల్వే… […]
[…] స్పోర్ట్స్ కోటాలో వెస్టర్న్ రైల్వే… […]