పోటీ ప‌రీక్ష‌ల‌కు 65 ప్ర‌త్యేక రైళ్లు.. తెలుగు రాష్ట్రాల‌కు కూడా..

ఢిల్లీ (CLiC2NEWS): పోటీ ప‌రీక్ష‌లు రాసేవారి కోసం ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌పాల‌ని రైల్వేశాఖ నిర్ణ‌యించింది. ఈ నెల 9,10, తేదీల్లో నిర్వ‌హించే సాంకేతికేత‌ర విభాగాల్లోని పోస్టుల కోసం రైల్యే నియామ‌క సంస్థ (ఆర్ఆర్ బి) ప‌రీక్ష‌ల‌కు హ‌జ‌ర‌య్యే అభ్య‌ర్థుల సౌల‌భ్యం కొర‌కు 65 ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌త్యేక రైళ్ల రుసుమును విద్యార్థులు చెల్లించాల‌ని, రాయితీలు ఉండ‌వ‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి. ఎక్కువ రైళ్లు మే 8వ తేదీన ఉంటాయి. కాకినాడ‌-క‌ర్నూలు, క‌డ‌ప‌-రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, కాకినాడ‌-మైసూరు, క‌ర్నూలు-మైసూరు, న‌ర్సాపురం-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-ఎర్నాకుళం, విజ‌య‌వాడ‌-నాగ‌ర్‌సోల్‌, షాలీమార్‌-విజ‌య‌వాడ‌, హ‌టియా-విజ‌య‌వాడ‌, న‌ర్సాపురం-తివేండ్రం వంటి ప్ర‌త్యేక రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.