హైదరాబాద్‌కు 65 టిఎంసీల నీటికుండ: మంత్రి కెటిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి 2072 వరకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ముందు చూపు ప్రణాలికలు రూపొందించామని పరిశ్రమల మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. వరుసగా ఏడేళ్లు కరవొచ్చినా తాగునీటికి ఇబ్బందు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. నల్లగొండ జిల్లా పెద్దపూర మండలం సుంకిశాల వద్ద ఇన్‌టేక్‌వెల్ ప్రాజెక్టకు మంత్రి కెటిఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ రంగారెడ్డి, మేడ్చల్ జల్లాల ప్రజలకు నిజంగా ఇవాళ మంచిరోజు అని మంత్రి పేర్కొన్నారు. మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు ఆధ్వర్యంలో రూ. 6 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో నీటి అవసరాలు 37 టిఎంసీలు…2072 వరకు నీటి అవసరాలు మరో 34 టిఎంసీలు ఉంటుంది. దాదాపు 71 టిఎంసీల నీరు అవసరం ఉండే అవకాశం ఉంది. 2035 వరకు 47 టిఎంసీలు 2072 నాటికి 70.97 టిఎంసీ నీరు అవసరం ఉంటుందని అంచానా వేశామాన్నారు.
సుంకిశాలలో 1450 కోట్ల అంచనా వ్యయంతో తాగునీటి అవసరాల నిమిత్తం పంపులు, మోటార్లతో పాటు అదనంగా 16 టిఎంసిలు లిఫ్ట్ చేయడానికి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఎండాకాలం నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలకు తాగునీరు అందిస్తామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.