ఐడిబిఐలో 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

IDBI: డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు మరియు చివరి ఏడాది విద్యార్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 650 పోస్టులు భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మార్చి 1, 2025 నాటికి 20-25 ఏళ్లు ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తును మార్చి 1వ తేదీ నుండి ప్రారంభవుతాయి. దరఖాస్తు ఫీజు మార్చి 12 వ తేదీ లోపు చెల్లించాల్సి ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1050 గా నిర్ణయించారు. ఎస్‌సి/ ఎస్‌టి/ పిడబ్ల్యుబిడిలకు రూ.250 చెల్లించాలి.
ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్ పరీక్ష ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించే కేంద్రాలు .. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఆహ్మదాబాద్, లఖ్‌నవూ, పట్నా లలో నిర్వహిస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ. 5వేలు, ఇంటర్న్‌షిప్ సమయంలో నెలకు రూ.15వేలు స్టైపెండ్ ఇస్తారు. ఉద్యోగంలో చేరాక సంవత్సరానిక రూ.6.14 నుండి రూ.6.50లక్షలు వేతనం అందుతుంది. పూర్తి వివరాలకు అభ్యర్థులు https//www.idbibank.in/ వెబ్‌సైట్ చూడగలరు.