బోనీ క‌పూర్ కారులోని 66 కేజీల‌ వెండి వ‌స్తువులు సీజ్‌..

బెంగ‌ళూరు (CLiC2NEWS): క‌ర్ణాట‌క‌లోని దావ‌ణ‌గెరె ప్రాంతంలో బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్ కారులోని వెండి వ‌స్తువుల‌ను ఈసి అధికారులు సీజ్ చేశారు. క‌ర్ణాట‌క రాష్ట్రంలో మ‌రికొన్ని రోజుల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల కోడ్ కూడా అమ‌ల్లోకి వ‌చ్చిన నేప‌థ్యంలో అధికారులు త‌నిఖీలు ప్రారంభించారు. దీనిలో భాగంగా బోనీ క‌పూర్‌కు చెందిన కారులో వెండి వ‌స్తువుల‌ను అధికారులు సీజ్ చేశారు. మొత్తం 66 కేజీల వెండి గిన్నెలు, ప్లేట్లు, స్పూన్‌లు ఉన్న‌ట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 39 ల‌క్ష‌లు ఉంటుంద‌ని వెల్ల‌డించారు. వ‌స్తువుల‌కు సంబంధించిన స‌రైన ప‌త్రాలు చూపించ‌క‌పోవ‌డంతో వాటిని సీజ్ చేసిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.