పదో తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 పోస్టులు..
కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరోలో మొత్తం 677 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో విజయవాడ సబ్సిడీ ఇంటిలెన్స్ బ్యూరోకు 17, హైదరాబాద్ సబ్సిడి ఇంటెలిజెన్స్ బ్యూరోకు 15 కేటాయించారు. సెక్యూరిటి అసిస్టెంట్ .. మోటార్ ట్రాన్స్ పోర్ట్, మల్లీ – టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో అన్ రిజర్వుడ్కు 404, ఒబిసిలకు 125, ఎస్సిలకు 34, ఎస్టిలకు 55, ఇడబ్ల్యుఎస్లకు 59.. మొత్తం 677 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు అభ్యర్థులను రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అభ్యర్థుల వయస్సు 25 సంవత్సరాలకు మించరాదు. దరఖాస్తు రుసుము రూ. 500 గా నిర్ణయించారు. నవంబర్ 13వ తేదీని దరఖాస్తుకు చివరితేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు www.mha.gov.in లేదా www.ncs.gov.in వెబ్సైట్ను చూడగలరు.