7న కెసిఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఈ నెల 7న (ఆదివారం) మద్యాహ్నం 2 గంటలకు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీకి సంబంధించిన ఏర్పాటు జరుగుతున్నాయి. కాగా భేటీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాగా ఈ భేటీకి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్టేట్ లెవల్కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులను ఆహ్వానించారు.