7 నుంచి తెలంగాణ అసెంబ్లీ

7 నుంచి తెలంగాణ అసెంబ్లీ
హైదరాబాద్: సెప్టెంబరు 7 నుంచి తెలంగాణ శాసన సభ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు కెసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 20 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల నిర్వహణపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్.. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ వీ నరసింహాచార్యులతో పాటు ఇతర అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ, ఏర్పాట్లపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.సమావేశాల నిర్వహణ సమయంలో కొవిడ్ నిబంధనలను అమలు చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి, సెక్రటరీ నరసింహాచార్యులను కేసీఆర్ ఆదేశించారు. భౌతిక దూరం పాటించేలా సీటింగ్ అరెంజ్‌మెంట్ చేయాలన్నారు. అసెంబ్లీ హాల్‌తో పాటు పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా పలు కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. రాష్ర్ట ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన బిల్లులు, తీర్మానాలను సభలో ప్రవేశపెట్టనున్నట్లు సీఎం తెలిపారు.