ఎపిలోని పాస్టర్లకు 7 నెలల గౌరవ వేతనం విడుదల..

అమరావతి (CLiC2NEWS): గుడ్‌ఫ్రైడే సందర్భంగా పాస్టర్లకు ఎపి సిఎం చంద్రబాబు శుభవార్తనందించారు. పాస్టర్లకు గౌరవవేతనం రూ.30కోట్లు విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల సమయంలో మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తాజాగా పాస్టర్లకు నెలకు రూ.5వేలు చొప్పున గౌరవ వేతనం విడుదలకు సిఎం అంగీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,427 మంది పాస్టర్లకు 2024 మే నుండి నవంబర్ వరకు 7 నెలల కాలానికి రూ.30కోట్లు విడుదల చేశారు.