కృష్ణానదిలో చిక్కుకున్న 70 లారీలు..!
నందిగామ (CLiC2NEWS): కృష్ణా జిల్లాలో చెవిటికల్లు వద్ద వరదలో చిక్కుకున్న 70 లారీలు. కృష్ణాజిల్లా నందిగామలో కృష్ణానదిలో అకస్మాత్తుగా పెరిగిన వరదలో ఇసుక లారీలు చిక్కుకున్నాయి. కంచికచర్ల మండలం చెవిటికల్లు ఇసుక ర్యాంపులోకి ఇసుక రవాణా నిమిత్తం వందకు పైగా లారీలు వెళ్లాయి. అకస్మాత్తుగా వరద రావడంతో వరద నీటిలో లారీలు నిలిచిపోయాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదతో రహదారి కూడా కొంత మేర దెబ్బతిన్నది. దీంతో లారీలో వెనక్కి రాని పరిస్థితి నెలకొంది. దీంతో లారీలు అక్కడే నిలిచిపోయాయి. ఈ ఘటనతో లారీ డ్రైవర్లు, యజమానులు ఆందోళన చెందుతున్నారు. సమాచారమందుకున్న పోలీసులు రెవెన్యూ, అగ్నిమాపక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్లను పోలీసులు పడవల్లో ఒడ్డుకు చేర్చుతున్నారు.