ఈ ఏడాది ఇంటర్లో 70% సిలబసే?
ప్రభుత్వానికి ఇంటర్ అధికారుల ప్రతిపాదనలు.. త్వరలోనే సర్కార్ నిర్ణయం!

హైదరాబాద్ (CLiC2NEWS): ప్రస్తుత (2021-22) విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్లో 70 % సిలబస్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఖరారు చేసింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్‌బోర్డుకు లేఖను పంపించింది. అలాగే 70 % సిలబస్ అమలుకు అనుమతినివ్వాలని కోరుతూ ఇంటర్‌బోర్డు అధికారులు రాష్ట్ర సర్కార్‌కు ప్రతిపాదనలు పంపించారు. కాగా దీనిపై ప్రభుత్వం త్వరలోనే సర్కార్ సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. గతేడాది 30 శాతం తగ్గించి, 70 శాతం సిలబస్‌ను ఖరారుచేశారు. ఈ విద్యాసంవత్సరం (2021-22) కూడా అదే అమలు చేయనున్నారు.