ఉత్త‌మ తెలుగు చిత్రం భ‌గ‌వంత్ కేస‌రి

71th National Film Awards 2025: జాతీయ తెలుగు చ‌ల‌న చిత్రం పుస్కారాల్లో ఉత్త‌మ తెలుగు చిత్రంగా బాల‌కృష్ణ న‌టించిన ‘భ‌గ‌వంత్ కేస‌రి’ ఎంపికైంది. 71వ జాతీయ చ‌ల‌న చిత్ర పుర‌స్కారాల జాబితాను శుక్ర‌వారం కేంద్రం ప్ర‌క‌టించింది. ఉత్త‌మ న‌టుడు షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ చిత్రం ఉత్త‌మ చిత్రంగా ఎంపికైంది.

నంద‌మూరి బాల‌కృష్ణ హీరో న‌టించిన భ‌గ‌వంత్ కేస‌రి ఉత్త‌మ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఈ సంద‌ర్బంగా బాల‌కృష్ణ స్పందిస్తూ ఈ గౌర‌వం చిత్ర బృందానికే చెందుతుంద‌న్నారు. జాతీయ అవార్డుల జ్యూరీకి హృదయ‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

టాలీవుడ్ నుండి ఉత్త‌మ యానిమేష‌న్‌- విఎఫ్ ఎక్స్‌( Animation- VFX), యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ (Action Choreography)లో హ‌ను-మాన్ చిత్రం ఎంపికైంది.

బెస్ట్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ మేల్ సింగ‌ర్ అవార్డులు బేబి చిత్రం ద‌క్కించుకుంది.

ఇక జాతీయ‌ ఉత్త‌మ చిత్రంగా 12th ఫెయిల్ నిలిచింది.

జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డు ఇద్ద‌రు పంచుకున్నారు. షార‌క్ ఖాన్ (జ‌వాన్), విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్‌)కు ద‌క్కింది.

త‌ప్ప‌క చ‌ద‌వండి : Movie Review: పవన్ ఫ్యాన్స్ జేజేలు.. సగటు ప్రేక్షకులు నిరాశ!

 

 

 

 

 

 

 

1 Comment
  1. […]                                   ఉత్త‌మ తెలుగు చిత్రం భ‌గ‌వంత్ కేస‌రి […]

Leave A Reply

Your email address will not be published.