ఇస్రోలో అప్రెంటిస్ ఖాళీలు..

ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), బెంగళూరు లో 75 అప్రెంటిస్‌షిప్ ఖాళీలు కలవు. గ్రాడ్యుయేట్ / డిప్లొమా అండ్ ట్రేడ్ అప్రెంటిస్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తులను ఇమెయిల్ ద్వారా ఏప్రిల్ 24వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తుల స్క్రీనింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. మే 20,21 తేదీలలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
వేదిక: ఐఎస్‌టిఆర్ఎసి, బెంగళూరు ప్లాట్ 12 & 13 , 3వ మెయిన్, రెండో ఫేస్, పీన్య ఇండస్ట్రియల్ ఏరియా, బెంగళూరు.
మెకానికికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ , ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ , ఏరోనాటికల్, సివిల్ , కంప్యూటర్ సైన్స్ , ఇంజినీరింగ్, లైబ్రరి సైన్స్, కమర్షియల్ ప్రాక్టీస్ .. విభాగాలు కలవు.
అప్రెంటిస్ ఖాళీలు 75
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 46
నెలకు స్టైపెండ్ రూ.9వేలు
డిప్లొమా అప్రెంటిస్ ట్రైనింగ్ / డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్-15
నెలకు స్ట్రైపెండ్ రూ. 8 వేలు అందజేస్తారు.
ట్రేడ్ అప్రెంటిస్ -14
ఐటిఐ అప్రెంటిస్‌లకు నెలకు రూ.7వేలు అందజేస్తారు.
సంబంధిత విభాగాల్లో బిఇ/ బిటెక్, ఎంఎల్ఐఎస్‌సి, ఇంజినీరింగ్ డిప్లొమా, ఐటిఐ ఉత్తీర్ణత ఉండాలి.