దేశంలో కొత్తగా 761 కొవిడ్ కేసులు.. 12 మంది మృతి
ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో 24 గంటల్లో 12 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 761 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఒక్క రోజులో కరోనాతో 12 మంది మరణించారు. కేరళలో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు మృతి చెందినట్లు కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో 30 కరోనా కొత్త వేరియంట్ జెఎన్.1 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కాగా కరోనాతో ఒక్క రోజులో 12 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.