ఎపిలో భారీ వర్షాలకు 8 మంది మృతి..సిఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 8 మంది మృతి చెందినట్లు సమాచారం. వర్షాలపై సిఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలకు జిల్లాలకు రూ. 3 కోట్ల చొప్పున తక్షణ విడుదల చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలన్నారు. రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తి అప్రమత్తతో ఉండాలని సిఎం ఆదేశించారు.
శ్రీకాకుళం-విశాఖపట్నం మధ్య శనివారం రాత్రికి తుఫాను తీరం దాటే అవకాశముంది. ఉత్తరాంద్రలో 3 జిల్లాల్లోని తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలను అప్రత్తం చేయాలని సిఎం ఆదేశించారు. తుఫాను తీరం దాటే సమయంలో 55 నుండి 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. నష్టం జరిగిన తర్వాత స్పందించడం కాదని.. నష్టం తగ్గించేలా అధికారుల పనితీరు ఉండాలని సిఎం స్పష్టం చేశారు.
[…] […]