8వేల పోస్టులు భర్తీ చేయాలి: సిఎం జగన్
జాబ్ క్యాలెండర్‌పై ముఖ్యమంత్రి సమీక్ష
అమరావతి (CLiC2NEWS): ఎపిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాబ్ క్యాలెండర్‌పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏడాది కాలంగా రిక్రూట్మెంట్ సహా ఇంకా భర్తీ చేయాల్సిన పోస్టులపై సమగ్రంగా సమీక్షించారు. జాబ్ క్యాలెండర్లో భాగంగా రిక్రూట్ చేసిన పోస్టుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. బ్యాక్లాగ్ పోస్టులు, ఎపిపిఎస్సి, వైద్య ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాక, ఉన్నత విద్య తదితర శాఖల్లో జరిగిన, జరుగుతున్న రిక్రూట్మెంట్పై సమగ్రంగా సిఎం చర్చించారు. జాబ్ క్యాలెండర్లో మిగిలిన 8వేలకు పైగా పోస్టులు సత్వరమే భర్తీ చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు.