ఎన్‌టిపిసిలో 80 ఎగ్జిక్యూటివ్ పోస్టులు

NTPC:  నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ (ఎన్‌టిపిసి) లిమిటెడ్‌లో 80 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఫిక్సెడ్ ట‌ర్న్ ప్రాతిప‌దిక‌న మూడేళ్ల కాలానికి గాను ఈ పోస్టుల‌కు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌టిపి స్టేష‌న్లు / ప్రాజెక్టులు/ జాయింట్ వెంచ‌ర్లు/ అనుబంధ సంస్థ‌ల్లో ఎక్క‌డైనా ప‌నిచేయాల్సి ఉంటుంది.

మొత్తం 80 పోస్టుల‌లో అన్ రిజ‌ర్వ్‌డ్‌కు 38, ఇడ‌బ్ల్యుఎస్‌ల‌కు 7, ఒబిసిల‌కు 20 , ఎస్‌ల‌కు 11, ఎస్‌ల‌కు 4 పోస్టులు ఉన్నాయి. ద‌ర‌ఖాస్తుల‌ను ఈ నెల 19వ తేదీలోపు పంపించాల్సి ఉంది. విద్యార్హ‌త‌లు, షార్ట్‌లిస్ట్ చేసి.. రాత ప‌రీక్ష‌/ కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఈ ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన వారికి ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తారు.

పోస్టుల వివ‌రాలు

ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్ సిఎ/ సిఎంఎ – ఇంట‌ర్ )-50: ఈ పోస్టుల‌కు గ్రాడ్యుయేష‌న్‌, సిఎ/ సిఎంఎ ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త ఉండాలి.ఫైనాన్స్‌/ అకౌంట్స్ విభాగంలో రెండేళ్ల అనుభ‌వం అవ‌స‌రం
ఈ ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు చేసుకునే వారి వ‌య‌స్సు 30 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు. ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ. 71వేలు ఉంటుంది. మూల వేత‌నానికి అద‌నంగా హెచ్ ఆర్ ఎ, రిటెన్ష‌న్ బెనిఫిట్, వైద్య స‌దుపాయాలు ఉంటాయి.

ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్ సిఎం/ సిఎంఎ-బి)-20: గ్రాడ్యుయేష‌న్ , సిఎ/ సిఎంఎ/ . ఫైనాన్స్‌/ అకౌంట్స్ విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 35 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ.90 వేలు గా నిర్ణ‌యించారు.

ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్ సిఎ/ సిఎంఎ-ఎ)-10: డిగ్రీ, సిఎ/ సిఎంఎ . ఫైనాన్స్ / అకౌంట్స్ విభాగంలో ఐదేళ్ల అనుభ‌వం అవ‌స‌రం. ఈపోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స్సు 40 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు. ఈ ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు మూల‌వేత‌నం నెల‌కు రూ.1,25,000 అందుతుంది.

పూర్తి వివ‌రాల కోసం అభ్య‌ర్థ‌లు వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.
https://careers.ntpc.co.in/recruitment/

Leave A Reply

Your email address will not be published.